సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు, శుక్రవారం ఉదయం భీమవరం పెద్ద మసీదు సెంటర్ వద్ద గల అంకాల ఆర్ట్ అకాడమి హాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పాల్గొని మహిళా సాధికారత పై మాట్లాడారు మహిళలు చదువుకుంటేనే దేశాభివృద్ధి సాధ్యమని, . మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుందని, కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్నారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో YSRCP జిల్లా మహిళా అడ్జక్షురాలు కోడె విజయలక్ష్మి, వైసీపీ నేతలు చినమిల్లి వెంకట్రాయుడు, AS రాజు, గాదిరాజు రామ రాజు, కామన నాగేశ్వరరావు, పెండ్ర వీరన్న కోడె యుగంధర్, చిగురుపాటి సందీప్ తదితరులు పాల్గొన్నారు.
