సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆర్థిక మం త్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్ ఫిక్సడ్ డిపాజిట్ చేసుకునేవారికి ఎక్కువ వడ్డీ ఇచ్చే పోస్టాఫీసు మంత్లీ వడ్డీ చెల్లింపులు స్కీమ్ (POMIS) ఖాతా డిపాజిట్ పరిమితిని ఒక ఖాతాకు రూ.4.50 లక్షల నుంచి రూ.9 లక్షలకు, జాయింట్ ఖాతా కు రూ.15 లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీ మ్ (POMIS)లో ఈ పథకం వడ్డీ రేటు ఇప్పు డు 7.10 శాతంగా ఉంది. ప్రతి నెలా దీనిలో వడ్డీ అందుకోవచ్చు. POMIS ఖాతాలో రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే నెలవారీ వడ్డీ ఆదాయం రూ.5,325, జాయింట్ ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే నెలవారీ ఆదాయం రూ.8,875 లభిస్తుంది. ఈ స్కీమ్లో కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టవచ్చు ఈ నెలవారీ ఆదాయం పథకం 5 సంవత్స రాల లాక్-ఇన్ వ్యవధితో ఉంటుంది.
