సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏ సర్కార్ 543 మంది సభ్యుల లోక్ సభలో మూడింట రెండువంతుల సంపూర్ణ మెజారిటీ తో అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో నేడు,సోమవారం ఉదయం నుండి స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. మౌలిక సదుపాయాలు, క్యాపిటల్ గూడ్స్, తయారీ రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 7.05 గంటలకు నిఫ్టీ 23,353 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. గత శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 22,530.70 వద్ద ఉంది. గత వారం నిఫ్టీ 50, S&P BSE సెన్సెక్స్ 2 శాతం చొప్పున పడిపోయాయి. ఇక రేపు ఫలితాలు అనుకున్న రీతిలో వస్తే స్టాక్ మార్కెట్ లో బుల్ దూసుకొనివుపోతుంది.
