సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శనివారం సాయంత్రం పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ సర్వే లను ప్రకటించాయి. దాదాపు అన్ని సర్వే లో దేశంలో ఎన్డీయే కూటమికి 290 నుండి 345 స్థానాలు వస్తాయని ప్రకటించడం గమనార్హం. దక్షిణాదిన ఎన్డీయే కు సుమారు 40 స్థానాలపైగా గెలిచే ఛాన్స్ ఉన్నట్లు తేల్చాయి. ఇక ప్రధానంగా ఏపీలో మరోసారి వైయస్ జగన్నే అధికారం లోకి రాబోతున్నట్లు ఎక్కువ సర్వేలు ప్రకటించారు. సర్వేలలో కీలకమైనదిగా భావించే ఆరా మస్తాన్ సర్వే సంస్ధ. వైసీపీకి 94- 104 స్థానాలు, టీడీపీ కూటమికి 71-81 సీట్లతో మరోసారి ప్రతిపక్షానికి పరిమితం కావచ్చని అంచనా వేసింది.సం క్షేమ పథకాలతో రాష్ట్రంలో మహిళలు 56 శాతం వైసీపీ కి పట్టం కడతారని , పురుషులు ఎక్కువ కూటమి పక్షాన నిలిచారని అంచనా వేసింది. మరి ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుండి , పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి , నారాలోకేష్ మంగళగిరి నుండి బాలకృష్ణ హిందూపురం నుండి, రఘురామా కృష్ణంరాజు ఉండి నుండి గెలవడం ఖాయం అని ప్రకటించడము గమనార్హం, అలాగే వైసీపీ కీలక నేత అయినా విజయసాయి రెడ్డి నెల్లూరు నుండి, బీజేపీ నేత పురంధరేశ్వరి రాజమండ్రి లో ఓటమి పాలు అవుతారని.. అలాగే మంత్రులుగా పని చేసిన రోజా, ఉషశ్రీ చరణ్, గుమ్మనూరు జయరాం, ఓడిపోతారని అలాగే మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి కూడా ఓడిపోతున్నట్లు అరా మస్తాన్ చెప్పారు.అయితే ఎంపీ స్థానాలు మాత్రం హోరాహోరీగా( 12- 14) వస్తాయని వైసీపీ ఒకటి 2 స్తనాలు ఎక్కువ గెలుచుకోవచ్చనని తెలిపింది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఆరా సర్వే అంచనా వేసింది. ఈ సర్వేలో బిజెపి కాంగ్రెస్ లకు చెరో 8 లేదా 9 స్థానాలు వస్తాయని, ఎంఐఎం 1 సీటు ఖాయం అని అంచనా వేసింది. కెసిఆర్ పార్టీ బిఆర్ ఎస్ కు ఒకటి కూడా కష్టమేనని తేల్చింది. ఏది ఏమైనా ఇవి కేవలం అంచనాలు మాత్రమే.. అసలు ఫలితాలు కావు. వీటిని పట్టుకొని పందాలకు దిగకండి..
