సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘భారతీయుడు2’ గత 4 ఏళ్లుగా అనేక అడ్డంకులు అధిగమించి సినిమా షూటింగ్ పూర్తీ చేసుకొంది. ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ చిత్ర విడుదల ఎప్పుడో మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెలియజేసింది. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకి ఇది సీక్వెల్‌. ఇందులో కమల్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించగా హీరో సిద్ధార్థ్‌ కీలక పాత్ర పోషించారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీత స్వరాలు సమకూర్చారు. విజయవాడ, తిరుపతి పరిసరాలలో చిత్రీకరణ పూర్తి చేసుకుని ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో జూన్‌లో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *