సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: క్రియేటివ్ డైరెక్టర్ భీమవరం కుర్రాడు ప్రశాంత్ వర్మ రూపొందించిన హనుమాన్ ఎట్టకేలకు ఒటిటి లో రిలీజ్ అయ్యిపోయింది. ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చి.. ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లూ రాబట్టిన ఈ పాన్ ఇండియా సూపర్ హిట్ చిత్రం ఈ మధ్యే 50 రోజులు కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనితో పాటే విడుదలైన సైంథవ్, గుంటూరు కారం, నా సామారంగా చిత్రాలు నెలరోజులు తిరగకుండానే వరుసగా ఓటిటి కి వచ్చేయగా ఈ హనుమాన్ మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ .. హనుమాన్ సినిమా హిందీ వెర్షన్ ను ఫస్ట్ టైమ్ జీ సినిమా ఓటీటీలోకి తీసుకు రావడమే కాక, సినీ ఫ్లెక్స్ శాటిలైట్ ఛానల్లో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా గత శనివారం(16.03.2024) నాడు హిందీ భాషలో టెలికాస్ట్ చేశారు. దీంతో మిలియన్లలోనే పబ్లిక్ హనుమాన్ సినిమాను చూసేసారు.
