సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అక్కి నేని, ఎస్వీ రంగారావు పై బాలయ్య చేసిన వ్యాఖ్యలు కు తెలుగు రాష్ట్రాలలో వారి అభిమానులు ఎంతటి ఆగ్రహానికి గురి అయ్యారో అందరికి తెలిసిందే.. అక్కినేని మనుమలు,అభిమానులు ఆగ్రహంతో సరిపెడితే స్వర్గీయ ఎస్వీ రంగారావు కు ఆయన అభిమానులకు బాలకృష్ణ క్షమాపణ చెప్పకపోతే, ఆయన అల్లుడు నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకొంటామని, గతంలో ఇదే తరహాలో చిరంజీవి ని కూడా బాలయ్య కించపరిచారని కాపునాడు తీవ్ర స్థాయిలో హెచ్చరించిన నేపథ్యంలో తాజాగా బాలకృష్ణ ఆ వ్యాక్యలు ఫై స్వాందించారు.. తాను అక్కినేనిని కించపరిచేలా తాను మాట్లాడలేదని ఎదో యాదృచ్ఛికంగా అన్న మాటలే తప్ప .. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదన్నారు. నేను ‘అక్కి నేని నాగేశ్వ రరావును బాబాయ్ అని పిలుస్తా. తన పిల్లల కంటే ఎక్కు వ ప్రేమ నాపై చూపించేవారు. పొగడ్తలకు పొంగిపోవద్దని ఆయన వద్దే నేర్చుకున్నా.. నాన్నగారిని కూడా ప్రజలు ఏంటోడు అంటారు.. తాడో పేడో అంటారు.. పేడు అంటే ఏమిటి ? నాపై అసంబద్ధంగా చేస్తున్న ప్రచారానికి నేను బాద్యుడిని కాను అని క్షమాపణ అన్న పదం లేకుండా బాలయ్య తనదయిన శైలి లో స్వాందించారు.
