సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: న్యూ ఢిల్లీ , తాజా వార్త సమాచారం ప్రకారం.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ పార్టీ ముసుగులో జరుపుతున్న ఉగ్ర కార్యకలాపాలు నేడు, గురువారం వెలుగు చూశాయి. దేశంలోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నేడు, గురువారం జరిపిన తాజా దాడుల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్ఐఏ,ఈడీ అధికారులు ఏకకాలంలో పలుచోట్ల ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో 10 రాష్ట్రాల్లో వివిధ నేరాలతో సంబంధాలున్న 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను ఎన్ఐఏ,ఈడీ అధికారులు అరెస్ట్ చేసారు. పీఎఫ్ఐ ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇవ్వడం, శిక్షణ శిబిరాలు నిర్వహణ, ప్రజలను ఉగ్రవాద సంస్థల్లో చేర్చిందని ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది అని ప్రకటించారు. 200కు పైగా ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాలు, పలువురు కార్యకర్తల ఇళ్లపై దాడులు చెయ్యడం సంచలనంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *