సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ‘ఆపరేషన్ కగార్’ లో భాగంగా ఇటీవల దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్ములించడానికి కంకణం కట్టుకొని పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వారి లొంగుబాటుకు ఆఖరి అవకాశంగా విధించిన గడువు మరి కొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. జార్ఖండ్ సింగ్‌భూమ్ జిల్లాలోని కిరిభూమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేడు, గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులు మరణించారు.
