సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నేడు, బుధవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, సంఘ సభ్యులు స్థానిక భీమవరం కలెక్టర్ కార్యాలయం నందు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి నీ కలిసి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగుల కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.. ఉద్యోగులు కష్టపడి పని చేసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లా లని కలెక్టర్ కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి చేతుల మీద జిల్లా ఎన్జీవో క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సంఘం కార్యదర్శి నెరుసు రామారావు, ఇతర కార్యవర్గ సభ్యులు, జె ఏ సి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్ ఎస్ హరనాధ్, ట్రెజరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యు.పాండురంగారావు, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు, మహిళా విభాగం జిల్లా కోశాధికారి తోట కుసుమ కుమారి, తదితరులు వున్నారు.
