సిగ్మాతెలుగు డాట్ ఇన్,న్యూస్: నందమూరి తారకరామారావు చనిపోయినప్పుడు తాను ఆయన ఆత్మతో మాట్లాడానని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి తెలిపారు. మంగళవారం ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘‘26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నా. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు నేను, ఆయన ఆత్మతో మాట్లాడాను . జీవిత రాజశేఖర్‌లు మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారు. ఎన్టీఆర్ ఆత్మ ఆ 16 ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి నాతో అనేక విషయాలు పంచుకుంది.’ అన్నారు. అయితే ఎన్టీఆర్ చల్లని చూపు తెలుగు ప్రజలపై ఉండాలని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేత మంచి పనుల కోసం ఎన్టీఆర్ ఆత్మ బలం పనిచేయాలని లక్ష్మీ పార్వతి కోరారు.ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలపై దాడుల గురించి మాట్లాడుతూ.. ఆ పని ఎవరు చేసినా తప్పేనన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేసి సీఎం జగన్ హుందాగా వ్యవహరించారని లక్ష్మీ పార్వతి అభినందించారు. up file photo..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *