సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహానాడు వేదికపై చంద్రబాబు సీఎం జగన్ ఫై చేస్తున్న ఆరోపణపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేసారు. మహానాడు వేదికపై వయస్సు మీద పడిన చంద్రబాబుకు ఏం మాట్లాడుతున్నారో? అర్థం కావటం లేదని, కార్యకర్తలకు సుత్తి కబుర్లు చెబుతున్నాడని దుయ్యబట్టారు. సైకిల్ గుర్తు ఎన్టీఆర్ సృష్టి అని, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు విమర్శించిన చంద్రబాబు అప్పట్లో హస్తం గుర్తు కింద పనిచేసేవాడని.. అటువంటి వాడు కాంగ్రెస్ లో ఓడిపోయి ఎన్టీఆర్ పంచన చేరి ఆయననే పార్టీ నుండి గెంటేసి పార్టీని,సీఎం పదవి ని హస్తగతం చేసుకొని ఇప్పడు టీడీపీ మహానాడు చేస్తున్నాడని విమర్శించారు. వైఎస్ జగన్ ధనిక సీఎం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అత్యంత ధనికుడైన రాజకీయ నాయకుడు చంద్రబాబు. ఎన్నికల డిక్లరేషన్, కొడుకు, కోడలు, మనవడి పైన ఆస్తులు పెట్టాడని, ఇన్కమ్ టాక్స్ రికార్డులు చూసినా ఈ విషయం తెలిసిపోతుందన్నారు. రెండు ఎకరాలతో మొదలై .. హెరిటేజ్ కాకుండా ఏం వ్యా పారాలు చేసి ఇన్ని వేలకోట్లు సంపాదించావ్? అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అవినీతికి తావు లేకుండా వైఎస్ జగన్ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనగదు జమ చేస్తున్నారని పేర్కొన్నారు.‘ఎన్టీఆర్ కుటుంబాన్ని ముక్క లు చేసేందుకు శకుని వేషం వేసింది ఎవరు? పేదలను కోటీశ్వరులను చేస్తానంటున్న చంద్రబాబు.. సీఎంగా ఉన్న 14 ఏళ్లలో ఎంతమందిని కోటీశ్వరులను చేశారో లిస్టు బయట పెట్టాలి. గెలిచాక పేదల ముఖం కూడా చూడని ఏకైక రాజకీయ వేత్త ఆయనే. నీ గత పాలనలో రాష్ట్రానికి అప్పులు తప్ప రాష్ట్రానికి చేసిందేమిటి? అని పేర్ని నాని ప్రశ్నించారు.
