సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు తో పాటు దేశవ్యాప్తంగా యావత్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. చివరి సారి ఆయన్ని చూసేందుకు ఎంతోమంది అభిమానుల పద్మాలయకి వచ్చారు. అయితే వీఐపీల కోసం అర్ధగంట వారిని నిలిపివెయ్యడంతో వేలాది మంది అయన ఆఖరి చూపుకోసం తహతహలాడంతో తీవ్ర త్రోపులాట జరిగింది. పోలిసుల లాఠీ చెయ్యడం తో పలువురు అభిమానులకుగాయాలు అయ్యాయని తాజా సమాచారం. నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు తో పాటు నందమూరి బాలకృష్ణ కూడా కృష్ణకు పార్థివ దేహం వద్ద నివాళ్లు అర్పించారు. .ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలుగు చిత్ర పరిశ్రమకి కృష్ణ గారు చేసిన సేవ ఎనలేనిది. మొదటి నుంచి ఆయన అన్ని ప్రయోగాలే చేశారు. మొదటి కలర్ సినిమా, మొదటి 70 ఎంఎం సినిమా వంటి ఎన్నో కొత్త పొకడలను టాలీవుడ్‌కి పరిచయం చేశారు. ఆయన మంచి సంకల్పంతో ముందుకు సాగుతూ ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆయనకి మా నాన్నగారు నందమూరి తారక రామారావుగారితో మంచి స్నేహం ఉండేది. వారిద్దరూ కలిసి ఎన్నో సినిమాలకు కలిసి పని చేశారు. వారిద్దరి మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. తెలుగు సినిమా స్థాయిని పెంచారు. వారిద్దరూ ఎప్పుడు నిర్మాత మంచి గురించే ఆలోచించేవారు.వారి సాహసం, ఆలోచనని అందరూ నేర్చుకోవాలి. అలాగే కృష్ణగారు నటుడి, నిర్మాతగా, పద్మాలయ అధినేతగా చిత్ర పరిశ్రమకి ఎంతో సేవ చేశారు. ఆయన మరణం ఆయన అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమకి కూడా తీరని లోటు. ఒకే ఏడాది సోదరుడిని, తల్లిని, తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న సోదరుడు మహేశ్‌కి, ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని వ్యాఖ్యానించారు.
