సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ లు తొలగింపుపై ఏపీలో మాజీ మంత్రి కొడాలి నాని తనదయిన భాషలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు మహానుభావుడు ఎన్టీఆర్ కు ద్రోహం చేసి ఆయన మరణానికి కారణమై, ఆయన పార్టీని దొంగిలించిన చంద్రబాబు తో కలసి బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్ ను వేధిస్తున్న ఘటనలను తెలుగు రాష్ట్రాల ప్రజలు సహించరని అన్నారు. వాళ్లది నీచాతినీచమైన బుద్ధి. వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చి నా జూనియర్ ఎన్టీఆర్ ని ఏం చేయలేరు. ఎన్టీఆర్ కు నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ లు తొలగించినంత మాత్రాన ఆయన వేలుపై బో.. కూడా పీకలేరు… ఎన్టీఆర్ కు వెన్ను పోటు పొడిచిన వారు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా?’’ ఛీ .. అంటూ కొడాలి నాని మండిపడ్డారు.
