సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు నేడు, గురువారం రాజ్య సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానమిచ్చారు. అయితే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు గత కొద్దీ కాలంగా డిమాండ్ చేస్తున్న పారిశ్రామిక వేత్త అదానీ ని మోడీ ప్రభుత్వం ఎందుకు రక్షిస్తుంది? అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.దీనిపై ప్రధాని మోడీ ఎక్కడ సూటిగా సమాధానం చెప్పక పోవడంతో సభలో మోడీ మాట్లాడుతునంత సేపు కాంగ్రెస్ ఇతర విపక్ష పార్టీ నేతలు గట్టిగ నినాదాలు చేస్తూనే ఉన్నారు. వారిని పట్టించుకోకుండా ప్రధాని మోడీ తన ప్రసంగంలో 2004 నుండి 2014 వరకు గత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయం అని ఎదురుదాడి చేసారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలకులు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేశారని మోదీ గుర్తు చేశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 50 సార్లకు పైగా ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొట్టారని ఆయన విమర్శించారు. తెలుగు దేశం పార్టీ అధినేత నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గుండె చికిత్స కోసం అమెరికా వెళ్తే ఆయన ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూలదోశారని మోదీ గుర్తు చేశారు.. ( ప్రధాని వ్యాఖ్యలు గతంలో కాంగ్రెస్ తో జత కట్టిన టీడీపీ అధినేత చంద్రబాబును ఒకింత ఇబ్బంది పెట్టేవే..) ప్రతిపక్షాలు ఎంత ఎక్కువ బురద జల్లితే, కమలం అంత గొప్పగా వికసిస్తుందని చెప్పారు అయితే కాంగ్రెస్ పాలనా కాలంలో కేవలం గోతులను మాత్రమే తవ్వారని దుయ్యబట్టారు. గడచిన మూడు, నాలుగేళ్ళలో దాదాపు 11 కోట్ల ఇళ్లకు కొళాయి నీటి కనెక్షన్లు అందినట్లు గడచిన తొమ్మిదేళ్లలో సుమారు 48 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరిచినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *