సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో వాడవాడలా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు టీడీపీ స్థానిక నేతల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్బంగా నేడు, బుధవారం భీమవరం వీరమ్మ పార్క్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు ఘన నివాళ్లు అర్పించారు. తదుపరి ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. తెలుగు జాతి గర్వించదగ్గ మహానీయుడు ఎన్టీఆర్ అని, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే అక్షర సత్య ఆలోచన, రాజకీయాల పట్ల ఎన్టీఆర్ దృక్కోణాన్ని తెలియచేస్తుందన్నారు. కిలో రూ 2 బియ్యం వంటి అనేక చారిత్రక నిర్ణయాలతో ఎన్టీఆర్ప్ర జల గుండెల్లో నిలిచిపోయారని, ప్రజలలో రాజకీయం చైతన్యం తీసుకువచ్చిన అన్న ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను అందరూ అవలంబిస్తున్నారని అన్నారు. అనంతరం టిడిపి నాయకులు మద్దుల రాము ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.
