సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, బుధవారం అసెంబ్లీ సమావేశాలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్‌ పేరు పెట్టడంపై టీడీపీ ఎమ్మెల్యే లు ఆందోళన నేపథ్యంలో ..సీఎం జగన్ సభలో మాట్లాడుతూ.. నందమూరి తారకరామారావు అనే పేరు పలికితే చంద్రబాబు కు నచ్చదని అన్నారు. నిజానికి ఎన్టీఆర్ గొప్పనటుడని, గొప్పఖ్యాతి సంపాదించారని కొనియాడారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కోకుండా ఉంటే ఇంకా ఎక్కువ కాలం బ్రతికేవారని అన్నారు.చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభ వల్ల ఎన్టీఆర్ అకాల మరణం చెందారన్నారు. అయితే ఆ మహానుభావుడు ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉండేలా జిల్లాకు పెట్టి ఇచ్చినమాటనిలబెట్టుకున్నామని ప్రకటించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో సిన్సియారిటీ, చిత్త శుద్ది కరువైందన్నారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు తెచ్చే ముందు అనేక సార్లు ప్రశ్నించుకున్నానని… పేరు మార్పుపై అనేక సార్లు ప్రశ్నించుకున్నా… చివరకు తాను చేస్తుంది కరెక్టే అని భావించాకే ఈ పేరుపెట్టాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. 108, ఆరోగ్యశ్రీ అంటే గుర్తుకు వచ్చేది వైఎస్ఆర్ అని… ఆయన వృత్తిపరంగా కూడా డాక్టర్ అని తెలిపారు. ఖరీదైన కార్పోరేట్ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెచ్చిన మానవతావాద మహా శిఖరం డాక్టర్ వైఎస్ఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు 1983 కన్నాముందే వచ్చాయని…మిగిలిన మూడు మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ హయాంలో వచ్చాయని తెలిపారు. తన హయాంలో మరో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నామని చెప్పారు. టీడీపీ చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలో కట్టలేదని ఎద్దేవా చేసారు. అయిన చంద్రబాబు హయాంలో పలు జంక్షన్ రోడ్లలో వై ఎస్ విగ్రహాలను తొలగించిన ఘటనలు ఎవరు మరచిపోలేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *