సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, బుధవారం అసెంబ్లీ సమావేశాలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై టీడీపీ ఎమ్మెల్యే లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో స్పీకర్ పోడియం చుట్టుముట్టి సభ నుండి ఒకరోజు సస్పెన్షన్ కు గురయి ప్రభుత్వ చర్య నిరసిస్తూ నినాదాలతో అసెంబ్లీ బయట ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో .. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తాజగా మీడియాతో మాట్లాడుతూ… 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో వైఎస్ఆర్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నిర్మించిన విశ్వవిద్యాలయానికి మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటావని సీఎం జగన్ ను ప్రశ్నించారు. పాత సంస్థలకు పేర్లు మార్చితే పేరు రాదని, కొత్తగా నిర్మిస్తే పేరు వస్తుందని, ఇటువంటి ప్రభుత్వ నిర్ణయాలను తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు.వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని అన్నారు.ఈ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులు కూడా బలవంతంగా కాజేశారని ఆరోపించారుకనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసి… వర్సిటీ పరువు తీసి ఇప్పుడు పేరు మార్చుతారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
