సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యంగ్ ఎన్టీఆర్ (NTR)హీరోగా నటించిన ‘దేవర’ పార్ట్-1 పాన్ ఇండియా సినిమాగా 550 కోట్ల వసూళ్లతో సంచలన విజయం నమోదు చేసింది. ఇప్పుడు ప్రఖ్యాత యాష్ రాజ్ బ్యానర్ ఫై తారక్ ‘వార్ 2’పై (war 2)మరింత అంచనాలు పెరిగాయి. హృతిక్ రోషన్ హీరోగా ఎన్టీఆర్ ప్రతినాయక షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్న చిత్రమిది. ఇప్పటికే ఎన్టీఆర్ పై చాల సన్నివేశాల్ని షూటింగ్ పూర్తీ చేసారు. ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లిపోయారు. ఈసారి హృతిక్ , ఎన్టీఆర్‌లపై సినిమాకే హైలైట్ గా నిలిచే పాట భారీ సెట్స్ లో చిత్రీకరించబోతున్నరు. .ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరూ మంచి డాన్సర్లే. కాబట్టి, హోరాహోరీ పోటీ పడతారు. వచ్చే సమ్మర్ కు రిలీజ్ అయ్యే ‘వార్ 2’ కోసం తెలుగులో ‘యుద్థభూమి’ అనే టైటిల్ ‘వార్ 2’ కోసం రిజిస్టర్ చేయించారని వార్తలొస్తున్నాయి. తెలుగులో ఎన్టీఆర్ కు కొన్ని అదనపు సన్నివేశాలు? ఉంటాయని తెలుస్తుంది. నిజానికి వార్-2 టైటిల్ కూడా ఈజీగా రీచ్ అవుతుంది. పాన్ ఇండియా సినిమా బిజినెస్ కి అదే కరెక్ట్ కూడా…
