సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్‌ పేరు తీసేసి… ‘వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీగా మార్చాలని ప్రతిపాదనలతో నేడు, బుధవారం ఏపీ శాసనసభలో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. దానితో అసెంబ్లీ సభా ప్రారభంతోనే టీడీపీ సభ్యులుఆందోళన ప్రారంభించారు. ఎన్టీఆర్ పేరు ఎలా మారుస్తారంటూ ప్రశ్నించారు. పోడియంను చుట్టుముట్టి గందరగోళం సృష్టించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే తమకూ గౌరవం ఉందన్నరు. అందుకే జిల్లా పేరు కూడా ఎన్టీఆర్ జిల్లా అని పెట్టామమన్నారు. అయితే వ్యక్తిగతంగా డాక్టర్ కూడా అయిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తో పాటు వైద్యరంగంలో అనేక సంస్కరణలు తెచ్చారని.. అందుకే ఆయన పేరు తీసుకుంటున్నామని శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. అనంతరం డిప్యూటీ సిఎం నారాయణ స్వామిమాట్లాడుతూ.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే టీడీపీ అంగీకరించలేదన్నారు. మీరు విశ్వసఘాతకులు, ఎన్టీఆర్ బ్రతికి ఉన్నపుడు వెన్నుపోటు పొడిచి గద్దె దింపి, ఆయనపై చెప్పులు రాళ్ళూ విసిరి అవమానించారు. మీకు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదంటూ ధ్వజమెత్తారు. ఈ గందరగోళం నడుమ సభను స్పీకర్ తమ్మినేని సీతారాం కొంత సమయం వాయిదా వేశారు. అటు శాసన మండలిలోనూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు తిరస్కరించారు. దానితో చైర్మన్ పోడియంను టీడీపీ ఎమ్మెల్సీలు చుట్టూ ముట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *