సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:తెలుగువారి పౌరుషం అనగానే ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఉన్న గుర్తుకువచ్చే ఏకైక పేరు.. ఎన్టీఆర్.. మరి నేడు,బుధవారం నట సార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. సమాజానికి సేవ చేయడం, నిరుపేదలు, అణగారిన వర్గాల ప్రజలకు సాధికారిత కల్పించడం కోసం ఆయన చేసిన కృషిని అభినందించారు. ఎన్టీఆర్ నటించిన చిత్రాలు, రచనలు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంటాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఎన్టీఆర్ నుంచి మనం ఎంతో ప్రేరణ పొందామన్నారు. ఎన్టీఆర్ ప్రజా నాయకుడుగా నడచిన బాటలో మనం ప్రయాణిద్దామని అన్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రి లోకేష్ కడపలో జరుగుతున్నా మహానాడు వేదిక వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి అంజలి ఘటించారు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ సమాధి ఘాట్ వద్దకు వెళ్లి పుష్ప గుచ్చాలు ఉంచి నివాళ్లు అర్పించి 5 నిముషాలు అక్కడే మోనంగా క్రింద కూర్చున్నారు.
