సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్డీయే కూటమి (NDA alliance) ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నేడు, బుధవారం నామినేషన్ (CP Radhakrishnan )దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా, గడ్కరీ హాజరయ్యారు. ఎన్డీయే కూటమి తో పాటు, కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు.. ఏపీలో జగన్ సారధ్యంలోని వైసీపీ కి చెందిన మొత్తం 11 మంది పార్లమెంట్ ఎంపీలు కూడా రాధా కృష్ణన్ కు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించడంతో ఆయన ఎన్నిక దాదాపు ఖాయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాధాకృష్ణన్ తమిళనాడు ప్రాంత వాసి. కోయంబత్తూరు నుంచి రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా.. జార్ఖండ్, తెలంగాణలో గవర్నర్‌గా పని చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. అలాగే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఇక ఇండియా కూటమి అభ్యర్థిగా తెలుగువారు.. తెలంగాణ వ్యక్తి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి (Supreme Court judge Sudarshan Reddy) పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. గురువారం సుదర్శన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
