సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వరుస నష్టాలతో దిగాలు పడిన స్టాక్ మార్కెట్ దేశీయ సూచీలు నేడు, గురువారం కాస్త తేరుకొన్నాయి. భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాలతో ఈ రోజును ముగించాయి. తనకు ఎదురు తిరిగిన యూరోపియన్ దేశాలను తిట్టిపోసిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గ్రీన్‌లాండ్ స్వాధీనం విషయంలో మాత్రం యుద్ధం చెయ్యనని కాస్త వెనక్కి తగ్గడం, అమెరికా-భారత్ ట్రేడ్ డీల్‌ ఖరారవుతుందనే అంచనాలు, వరుస నష్టాల నేపథ్యంలో భారత్ సూచీలు లాభపడ్డాయిగత సెషన్ ముగింపు (81,909)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 500 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా అదే ధోరణిలో కొనసాగింది. ఒక దశలో దాదాపు 900 పాయింట్లు లాభపడి 82,783 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే చివరకు సెన్సెక్స్ 397 పాయింట్ల లాభంతో 82,307 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా చివరకు 132 పాయింట్ల లాభంతో 25,289 వద్ద స్థిరపడింది (stock market).బ్యాంక్ నిఫ్టీ 399 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 767 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.62 వద్ద ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *