సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల దారుణ నష్టాలలో మునిగిన స్టాక్ మార్కెట్ లో మరల సూచీలు నేడు, మంగళవారం లాభాల వేటలో ఫై పైకి ఎగబాకటం మొదలు పెట్టాయి. గత 7రోజులలో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ లో దాదాపు రూ.23.50 లక్షల కోట్ల నష్టాన్నిచవిచూశారు, మరోవైపు నేడు ఉదయం కేవలం గంటన్నర సమయంలో ఇన్వెస్టర్లు రూ.6.50 లక్షల కోట్లకు పైగా రికవరీ చూసారు. నేడు, మంగళవారం , సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఒక శాతానికి పైగా పెరిగాయి. సెన్సెక్స్ మరోసారి 78 వేల పాయింట్ల స్థాయిని అధిగమించింది. మరోవైపు నిఫ్టీ 300 పాయింట్లకు పైగా ఎగబాకింది.ఉదయం 11న్నర గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్సేం జ్ ప్రధాన సూచీ దాదాపు 1000పాయింట్లు పెరిగి 78,309.57 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది ఐటీ,ఆటో, ఎనర్జీ షేర్లు పెరగడమే స్టాక్ మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ వంటి ఆటో స్టాక్స్ లో పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి బడా ఐటీ కంపెనీల షేర్లలో పెరుగుదల కనిపిస్తోంది.
