సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ సభ స్థానాలలో ఎస్సీ ఎస్టీ బిసిలకు పెద్దపీట వేస్తూ అధికార వైఎస్సా ర్సీపీ ప్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో.. నేడు, శుక్రవారం సాయంత్రం పార్టీ అధిష్టానం శుక్రవారం సాయం త్రం ఆరో జాబితాను విడుదల చేసింది. ఇందులో కీలకమైన నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గాల ఇన్ఛార్జిలను మార్చింది వైఎస్సార్సీపీ అధిష్టానం. మేరుగ నాగార్జున, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ జాబితాను ప్రకటించారు. రాజమండ్రి ఎం పీ స్థానానికి, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గుంటూరు ఎం పీ స్థానానికి ఉమ్మా రెడ్డి వెంకట రమణ, పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం ఎం పీ స్థానానికి గూడురి ఉమాబాల(అడ్వొ కేట్), , చిత్తూరు ఎం పీస్థానానికి(ఎస్సీ ) ఎన్ రెడ్డప్ప .. మైలవరం ఎమ్మె ల్యే సర్నాల తిరుపతిరావు యాదవ్, మార్కాపురం ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరు, ఎమ్మెల్యే కే నాగార్జున రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మె ల్యే ఎండీ ఖలీల్(డిప్యూటీ మేయర్ గా ఉన్నారు), జీడీ నెల్లూరు కే నారాయణస్వామి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బుట్టా రేణుకను ఇన్ఛార్జిలుగా నియమించారు. ఇప్పటివరకు ఐదు జాబితాల వారీగా.. 61 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాలకు, 14 పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జిలను మార్చేసింది. ఇదిలా ఉంటే.. వైసిపి పార్టీ తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు(3 ఎం పీ, 24 అసెంబ్లీ),మూడో జాబితాలో 21 స్థానాలకు(6 ఎం పీ, 15 అసెం బ్లీ), నాలుగో జాబితాలో 8 స్థానాలకు(1 ఎం పీ, 8 అసెం బ్లీ),ఐదో జాబితాలో 10 స్థానాలకు(4 ఎం పీ, 6 అసెం బ్లీ స్థానాలకు) సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది
