సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ టీడీపీ అడ్జక్షుడు అచ్చేమ్ నాయుడు నేడు, బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు టీడీపీ అధినేత చంద్రబాబు ను జైలులోనే ఉంచేందుకు అనేక అక్రమ కేసులు వేసి కుట్ర జరిగిందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితులలో ఆయన బయటకు రాకూడదనే సీఎం జగన్ రేపు గురువారం ఢిల్లీ వెళ్లి అక్కడ పెద్దలను కలవనున్నారని ఆరోపించారు. అయితే చంద్రబాబు అరెస్టు కేంద్రం లోని బీజేపీకి తెలిసి జరిగిందా? తెలియక జరిగిందా ?అనేది దేవుడికే తెలియాలి.. చంద్రబాబు అరెస్టు అక్రమమని తెలిసి కూడా బీజేపీ నేతలు కనీసం స్పందించకపోవటం దారుణమన్నారు. జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యుల కమిటీని త్వరలో ప్రకటిస్తాం .. ఏది ఏమైనా ఈ నెల 9వ తేదీలోపు చంద్రబాబు బయటకు వస్తారని భావిస్తున్నాం .. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు చేస్తున్న రిలే దీక్షలు ఈ నెల 9వ తేదీ వరకూ కొనసాగుతాయన్నారు. చంద్రబాబు బయటకు వచ్చే ప్రక్రియ ఇంకా ఆలస్య మైతే.. 10వ తేదీ నుంచి నిరసనలకు కొత్త కార్య క్రమం చేపడతామని అన్నారు. ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ కి సంబంధం లేదని నిన్న ( మంగళవారం ) న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చింది అని మరి ఎన్నో ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడేమంటారు?..అని ప్రశ్నించారు.
