సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఏపీ ఉద్యోగ సంఘ నేతల తో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చలకు ముందు సమావేశం హాలు ముందు..ఏపీ సచివాలయ ఉద్యోగులలో కొందరు నేతల పై మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రి బొత్స, సజ్జల, సీఎస్ జవహర్ రెడ్డిని సెక్రటేరియట్ ముందు ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు అడ్డుకున్నారు. వెంటనే తమ సీపీఎస్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర సచివాలయం ఉద్యోగులు డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లిస్తామని చెప్పాము కదా ? మరల ఇదేమిటీ సమావేశానికి వెళుతున్న తమను ఇబ్బంది పెట్టడం బాగోలేదని ఉద్యోగులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అయితే వారు.. ఎన్నికల కోడ్ రాక మునుపే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చెయ్యడంతో సీపీఎస్ ఉద్యోగులపై మంత్రి బొత్స, సలహాదారు సజ్జల కోపంగా.. ఎన్నికల కోడ్‌కు బకాయిలుకు విడుదలకు సంబంధం ఏమిటని? ఎన్నికల కోడ్ నిబంధనలు మీకు తెలుసా? అని ప్రశ్నించారు. ఏదైనా మీటింగ్ వచ్చి మాట్లాడాలని.. ఇలా రోడ్ల పై తిరగద్దు.. లోపలకు రండి అంటూ బొత్స అనగానే వారు తమకు ఆహ్వానం లేదని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యులకు మాత్రమే ఆహ్వానం ఉందని ఉద్యోగులు తెలిపారు. అయితే మీరు మరోమారు వచ్చి కలవాలని మంత్రి బొత్స, సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *