సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటికి టాప్ హీరోగా కొనసాగుతున్న హీరో వెంకటేష్ రాజకీయాలకు, వివాదాలకు చాలా దూరం గా వుంటారు. గత 2 దశాబ్దాల క్రితం మాత్రం బాపట్లలో తండ్రి రామానాయుడు టీడీపీ ఎం పీగా వున్నపుడు తప్పించి, ఎప్పుడు వివాదాలకు, రాజకీయాలకు దూరంగా వుంటూనే వస్తున్నారు. అయితే ఈ సారి రెండు చోట్ల విక్టరీ, వెంకటేష్ తన స్వంత మనుషుల కోసం తెలంగాణలో అధికార ఎన్నికల ప్రచారం లోకి దిగారు. ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి కుమారుడు విక్టరీ వెంకటేష్ అల్లుడు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఏపీలో సీఎం జగన్ కు సన్నిహితుడు గా పేరున్న పొంగులేటి కి కూడా వెంకటేష్ కు వియ్యంకుడే. వీరిరువురి కోసం వెంకీ మామ ఎన్నికల ప్రచారంలో పార్టీ జెండా పెట్టుకోకుండా వారికీ సంఘీభావంగా ప్రచారం చెయ్యడం,దానికి ఎక్కడ చుసిన విశేషంగా జనాదరణ రావడం గమనార్హం. ఇక ఏపీలోని లోని కైకలూరు నుంచి పోటీ చేస్తున్న కామినేని శ్రీనివాస్ కు కూడా వెంకీ భార్య కు స్వ యాన మేనమామ అని తెలుస్తుంది. మరి ఆయన కోసం కూటమి తరపున ప్రచారానికి వస్తారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *