సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినిమా ఖ్యాతి ని భారతీయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో, మహేష్‌ బాబు హీరోగా సినిమా షూటింగ్ మరి కొద్దీ రోజులలో ప్రారంభం కానుంది. బాహుబలి, సిరీస్, RRR వంటి అద్భుతాల తర్వాత పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ఎదిగిన రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే హాలీవుడ్ హీరోను తలపించే కండల గంధర్వుడు గా మహేష్ లుక్ మారిపోయింది. ssmb29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో భారతీయ నటి నటులతో పాటు 50 శాతం వరకు హాలీవుడ్ నటులు ఉంటారని తెలుస్తుంది. ఈక్రమంలోనే ఈమూవీ బడ్జెట్‌ 1000 కోట్ల పైమాటే.. ఉంటుంది.. పైగా 2 భాగాలుగా నిర్మిస్తున్నారు. విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయాలని రాజమౌళి.ప్లాన్.. అలాగే ఈ సినిమా కోసం రాజమౌళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించనున్నారని.. ఇందులో భాగంగానే ఇప్పటికే రాజమౌళి.. AIలో స్వయంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారని తెలుస్తుంది. అదికాక ఇండియన్ కౌబాయ్ .. సూపర్ స్టార్ కృష్ణ ఒక కీలక రోల్ ను అయి టెక్నాలజీ సహాయంతో? కనిపిస్తారని దీనికి కసరత్తు జరుగుతున్నట్లు వినికిడి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *