సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం భీమవరంలో తన నూతన క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం తదుపరి, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్.హెచ్ 165 నిర్మాణం కు నిధులు,​నరసాపురం నుండి వందే భారత్, నూతన రైలు సర్వీసులు సాధించడం జరిగిందని, ​వారణాసి కూడా భీమవరం మీదుగా ఎక్స్ ప్రెస్ రైలు సాధిస్తానని, ఇటీవల తన కృషితో ‘అరుణాచలం’ వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలు రేగులైజ్ చేస్తున్నామని, రైల్వే క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆర్.ఓ.బి (ROB) ల నిర్మాణం,​పార్లమెంట్ పరిధిలోని స్మశానాల ఆధునీకరణ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ​ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఆధునిక సదుపాయాలతో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయబడిందని, ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. నిరంతరం ప్రజల నుండి వచ్చే విజ్ఞప్తులను స్వీకరించి, వాటిని సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని శ్రీనివాస వర్మ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *