సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వైసీపీ నుండి ఇద్దరు రాజ్య సభ సభ్యులు టీడీపీ వైపు చుస్తూండటం.. తదితర పరిణామాల నేపథ్యంలో రాజ్య సభ సభ్యులు విజయసాయి రెడ్డి తో అందరు కూటమి వైపు వచ్చేస్తారని ఇటీవల వార్తల వైరల్ చేస్తున్నవారి పట్ల ఎంపీ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేడు, గురువారం ఖండన విడుదల చేసారు. తాను వైసీపీని వీడేది లేదని , తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన వీడుతున్నట్టుగా కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి తాను పార్టీ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. నేను ఎప్పటికి వైఎస్ జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని తెలిపారు. వైఎస్ఆర్‌సీపీలోనే తాను కొనసాగుతానని పేర్కొన్నారు. అలాగే, వైసీపీ పార్టీకి తాను విధేయత, నిబద్ధత కలిగిన కార్యకర్తగా పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీని వీడి మరో రాజకీయ పార్టీలో చేరుతున్నానని మీడియాలో ఒక వర్గం చేస్తున్న నిరాధారమైన ఊహాగానాలు, తప్పుడు సమాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *