సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదాలుకు అడ్డు అదుపు లేకుండా ప్రతి రోజు జరుగుతూనే ఉన్నాయి. నేటి శనివారం ఉదయం రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని కొటేకల్ గ్రామం వద్ద ఓ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది(Yemmiganur Accident). రెండు కార్లు ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు( cars crash ). మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోనికి తరలించారు.వీరంతా ఉండగా కర్ణాటక నుంచి ఏపీలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం దర్శనం కోసం వెళ్తుండగా. విషాద ఘటన జరిగింది. మృతులంతా కర్ణాటక రాష్ట్రం కోలార్ లోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా నేటి శనివారం ఉదయం బెంగళూరు(Bengaluru) నుంచి మంత్రాలయం వెళ్తున్న కర్ణాటక బస్సు పత్తికొండ పరిధిలోని తుగ్గలి వద్ద బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వారిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. పూర్తీ సమాచారం అందవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *