సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన రైల్వేకోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ వివాహేతర సంబంధాలు,లైంగిక వేధింపుల ఆరోపణలు, నగ్న వీడియోల వైరల్ ఎపిసోడ్‌లో ఎమ్మెల్యే ఫై ఆరోపణలు చేసిన మహిళ ఉద్యోగి నే అరెస్ట్ చేసి జైలుకు పంపడం సంచలనం రేపింది. అయితే ఆ మహిళకు తాజగా ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది.ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్యేను ఆమె తరచూ బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరించారని, ఎమ్మెల్యే తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన కేసులో ఏపీ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది. సాక్షుల్ని బెదిరించడం, ప్రభావితం చేయకూడదని, కోర్టు అనుమతి తీసుకోకుండా జిల్లా దాటి వెళ్లకూడదని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *