సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి గోదావరి జిల్లాల వైసిపి పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త , రాజ్య సభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ నేడు, శనివారం రాత్రి భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో గ్రంధి శ్రీనివాస్ తో కొద్దీ సేపు మాట్లాడుకోవడం జరిగింది. తదుపరి సుభాష్ చంద్ర బోస్ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. ఎవరు ఏమి అనుకున్న అభివృద్ధి విషయంలో మీ ఎమ్మెల్యే రాజీపడే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని.. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమంలో రెండడుగులు ముందుకు వేస్తే నేడు ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో రెండడుగులు ముందుకు వేసి రాష్ట్రంలో ఉన్నతమైన పాలన అందిస్తున్నారని అన్నారు.
