సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల గ్రంధి వెంకటేశ్వర రావు మరణంతో విషాదంలో ఉన్న భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆయన కుటుంబ సభ్యులను రాజకీయ పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక జిల్లా ప్రముఖులు, శ్రేయాభిలాషులు తో పాటు ప్రతి రోజు ఎంతో మంది ప్రజలు పరామర్శిస్తున్నారు. గ్రంధి నివాసం లో ఏర్పాటు చేసిన, వెంకటేశ్వర రావు చిత్ర పటానికి నివాళ్లు అర్పిస్తున్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ని కొద్దీ గంటల క్రితం పరామర్శించిన నేతల వివరాలు..మాజీ డిప్యూటీ స్పీకర్ అవనిగడ్డ మండలి బుద్ధ ప్రసాద్ ,జనసేన జిల్లా అడ్జక్షుడు కొటికలపూడి గోవింద రావు , డాక్టర్ వేగిరాజు రామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, టీడీపీకి చెందిన పాలకొల్లు,ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు , ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ,ఉండి మాజీ శాసనసభ్యులు కలవపూడి శివ, వైసీపీ మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు , జనసేన బొమ్మిడి నాయకర్ ,తూర్పుగోదావరి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ నామన రాంబాబు , తదితర ప్రముఖులు పరామర్శించారు…
