సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం నియోజవర్గంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నాడు-నేడు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి నేడు,మంగళవారం రాత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో పుస్తక ఆవిష్కరణ జరిగింది. గ్రంధి శ్రీనివాస్ 2004 లో మొదటిసారి వై యస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో జరిగిన అభివృద్ధిని, అదే మాదిరిగా రెండోసారి 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో జరిగిన కోట్లాది రూపాయలు తో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి వివరాలను పొందుపరిచారు. వీటిలో వేండ్ర వద్ద 120 ఎకరాల భూ సేకరణ చేసి మంచినీటి స్టోరేజ్ ట్యాంక్ ను నిర్మించడం , పేదల ఇళ్ల కోసం తాడేరు వద్ద 82 ఎకరాలు సేకరణ, భీమవరం పట్టణంలో సెంట్రల్ లైటింగ్, నియోజకవర్గ పరిధిలో భారీ మురుగు డ్రైన్స్ నిర్మాణం, యనమదురు కాలువపై పలు వంతెనల నిర్మాణం, భీమవరం మండలం, వీరవాసరం మండలంలో చేసిన కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు, ఇటీవల వేలాది మంది పేదల ఇళ్లస్థలాల కోసం వందలాది ఎకరాల సేకరణ,వార్డు సచివాలయాలు, పాఠశాలల నిర్మాణం తదితర అంశాలు ఉన్నాయి. వీరవాసరం ఎం ఆర్ కె జిల్లా పరిషత్ హైస్కూల్లో తెలుగు పండిట్ గా పనిచేస్తున్న పంపన సాయిబాబు ఈ పుస్తకం రచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, కందిపోయిన వాసు, కందిపోయిన గిరి, కోడె యుగంధర్ ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *