సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో నేడు,ఆదివారం వైసిపి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పలువురు వైసిపి నేతలు పాల్గొని నిన్న జనసేన జిల్లా అడ్జక్షుడు కొటికలపూడి గోవిందరావు ( చినబాబు) స్థానిక ఎమ్మెల్యే చేసిన విమర్శలు త్రిప్పికొట్టారు. ముఖ్యంగా వైసీపీ లో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కీలక పదవులలో ఉన్న బిసి నేతలు మాట్లాడారు. కామన నాగేశ్వర రావు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ దారుణ బూతుల పదజాలం,సీఎం జగన్ ప్రభుత్వ ప్రజా సంక్షేమం సేవలకు ఇక జనసేన కు భవిషత్తు లేదని భావించి క్యాడర్ చేజారిపోకుండా.. ఆడవారిలా చెప్పు చూపించి, తీవ్ర అసహనంతో చేసిన విన్యాసాలు తెలుగు ప్రజలు అందరు చూసారని, పవన్ ఫై గెలిచిన మన స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దానిపై స్వాందిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఏమిటి? ఎమ్మెల్యే ని బూతులు తిట్టడానికి , బెదిరించ డానికి మీ జనసేన కార్యకర్తలు ఎంతమంది ఉన్నారేమిటి? పోనీ చూసుకొందాం మీకన్నా మా వైసిపి క్యాడర్ అనేక రేట్లు ఎక్కువమంది ఉన్నారు. మీకు ఎలా కావాలంటే ఆలా? గతం కంటే గ్రంధి శ్రీనివాస్ కు తక్కువ ఓట్లు వచ్చాయని చెబుతావా? మొన్న జరిగింది త్రిముఖ పోటీ చినబాబు.. ఆ రాజకీయ పరిణితి కూడా లేదు. ఏమిటి 2012 నుండే రైల్వే టర్నల్ ఆమోదించారా? అప్పుడు ఆమోదించినవి నిజానికి 5 ఓవర్ బ్రీజ్ లు అనికూడా నీకు తెలియదు. ఓవర్ బ్రీజ్ నిర్మాణాలు జరిగితే ఎక్కువకాలం ప్రజలకు ఇబ్బందులు తప్పవని, రైల్వే అధికారులు స్థానిక ఎమ్మెల్యే ఆఫీస్ కు వచ్చినప్పుడు వాటిని టర్నల్ గా మర్చి వాటి ఎత్తు భారీ వాహనాలు వెళ్ళడానికి అనువుగా ప్రతిపాదించింది గ్రంధి శ్రీనివాస్ మాత్రమే .. ఆ విషయంలో ఢిల్లీ లో ఎంపీ రఘురామా కృష్ణంరాజు కూడా కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలో, ఆమోదించడంలో కృషి చేసారు. అంతే కానీ నువ్వు చైర్మెన్ గా చేసింది అభివృద్ధి ఏమి ఉంది? నువ్వు పట్టాన చైర్మెన్ గా ఏమి చెయ్యలేక ప్రతిపాదనలతో సరిపెడితే ..నిధులు సేకరించి సమస్యలు పరిష్కరించి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నిర్మాణాలు పూర్తీ చేసారు. ఇక కస్తూరిబా జూనియర్ కాలేజీ స్థలం లేక ప్రక్క టౌన్ కు వెళ్లిపోతుంటే తన 35 సెంట్ల స్థలం ఇచ్చి అక్కడ కట్టించి దాతగా గ్రంధి వెంకటేశ్వర రావు పేరు పెట్టారు. అది తప్ప? టిడికో ఇళ్ల నిర్మాణంలో గ్రంధి శ్రీనివాస్ అప్పటి మీ టీడీపీ పెద్దల దోపిడీ ఫై చేసిన పోరాటం వల్లే ప్రభుత్వానికి కొన్ని వందల కోట్లు మిగిలాయి అని విమర్శించారు. కోడె యుగంధర్ మాట్లాడుతూ.. స్థాయిల గురించి మాట్లాడితే చినబాబు కు గ్రంధి శ్రీనివాస్ ను విమర్శించే స్థాయి ఉందా ?వైసిపి లోకి గ్రంధి శ్రీనివాస్ ను ఆహ్వానించడానికి స్వయంగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడే సభ నిర్వహించడాన్ని చినబాబు మర్చిపోతే ఎలా? అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *