సిగ్మాతెలుగు,డాట్ ఇన్, న్యూస్: భీమవరం నియోజకవర్గం ప్రజలకు నేడు, శనివారం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సాటి మనిషిని ప్రేమించమని, ప్రేమలోనే భగవంతుడు ఉన్నాడని ప్రపంచానికి చాటిచెప్పిన ఏసుక్రీస్తు మానవాళికి అందరికి ఆదర్శనీయుడని, దైవ కుమారుడిగా ఆయన త్యాగాలను సహనాన్ని, ప్రేమను ఆదర్శవంతంగా తీసుకొందామని , అందరికి ప్రభువు అస్సిసులు ఉండాలని క్రైస్తవ సోదరులకు, సోదరిమణులకు శుభాభినందనలు అన్నారు. ఇక ఆయన కార్యలయం ఆవరణలో పలువురు క్రెస్తవ ప్రముఖులు, చర్చి ఫాథర్స్ రావడం వారి సమక్షంలో క్రిస్మస్ కేకు కట్ చేసి ప్రభువు జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. గత రాత్రి నుండి నేటి ఉదయం వరకు నియోజకవర్గ పరిధిలో పలు చోట్ల జరిగిన ప్రార్ధన కార్యక్రమాలలో , వేడుకలలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఉత్సహంగా పాల్గొంటున్నారు,
