సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో సీఐడీ పోలీసులు కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపిస్తూ .. ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో నమోదు చేసి విచారణ జరుగుతున్నా కేసు విషయంలో .. ఆయన కేసులో దర్యాప్తు అధికారిని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రకాశం ఎస్పీ దామోదర్‌కుదర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు గుంటూరు జిల్లా పాలన విభాగం ఏఎస్పీ రమణమూర్తి దర్యాప్తు బాధ్యతలు చూస్తున్నారు. వెంటనే కేసు రికార్డును ప్రకాశం ఎస్పీకు అప్పగించాలని గుంటూరు అడ్మిన్ ఏఎస్పీకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి విజయ పాల్‌కు హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.అయితే విజయ పాల్ ఫై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కాగా పోలీసులు ఇటీవల విజయ పాల్‌ను విచారణకు పిలిపించారు. అయితే హైకోర్టు బెయిల్ తిరస్కరించినా విజయ పాల్‌ను అరెస్ట్ చేయడంలో పోలీసులు ప్యూహాత్మకంగా వ్యవహరించలేదని భావించిన ప్రభుత్వం దర్యాప్తు అధికారిని మార్చడం గమనార్హం.
