సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం పార్టీ సీనియర్ , బీమిలి ఎమ్మెల్యే, గంటా శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యే , విష్ణు కుమార్ రాజు ఫై విశాఖలో నడి రోడ్డుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భీమిలి లోని ఫిల్మ్ నగర్ కు కేటాయించిన స్థలాలపై విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణురాజు కలెక్టర్ కు పిర్యాదు చెయ్యడం ఆయన దానిపై దర్యాప్తు కు ఆదేశించడం జరిగింది. నేడు, శనివారం అనుకొకుండా వారిరువురు ఎమ్మెల్యేలు తారసపడటం జరిగింది. దీనితో గంటా తీవ్ర ఆగ్రహంతో అసలు నా నియోజకవర్గం వ్యవహారాలలో వేలు పెట్టి కలెక్టర్ కు పిర్యదు చెయ్యడానికి నువ్వు ఎవరు? నీకేమిటి సంబంధం ? అని తన అసంతృప్తి ని వ్యక్తం చెయ్యడం తో విశాఖ ఎమ్మెల్యే విష్ణు రాజు సర్ది చెప్పటానికి ప్రయత్నించిన అక్కడ మీడియా కవర్ చేస్తున్న గంటా ఆగ్రహాన్ని ఏమాత్రం తగ్గించకుండా కారు లో కూర్చున్నారు. మరో వైపు విష్ణు రాజు ఎదో చెపుతున్న ఇక చాలు అన్న రీతిలో గంటా తన మాటలు కొనసాగించడం జరిగింది.
