సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నా విషయం ఆ స్థానాలలో కూటమి పార్టీల అభ్యర్థులు నామినేషన్స్ వేస్తున్న విషయం విదితమే.. దీనిలో భాగంగా.. నేడు, శనివారం ఉదయం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని వెంట వచ్చిన మంత్రి నారా లోకేష్ బలపరిచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, బొల్లిశెట్టి శ్రీనివాస్, కొణతల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.వచ్చే ఉగాది పర్వదినం నాటికీ నాగబాబు రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నారు.
