సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మ్మడి గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ డేటు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పక్షం తెలుగు దేశం పార్టీతో పాటు లెఫ్ట్ పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థులు స్వతంత్రులు మధ్య హొరాహొరు ప్రచార హోరు చివరి అంకానికి చేరుకొంది. ఈ నేపథ్యంలో నేడు, శనివారం భీమవరంలో ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులు బలపరిచిన పిడిఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులకు శాసనమండలి కి జరుగుతున్న ఉభయగోదావరి నియోజకవర్గ పట్టభద్రులఎన్నికల్లో ఓట్లు వేసి ఘన విజయం అందించాలని ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులు , పట్టభద్రులు , నిరుద్యోగులను ఓటర్లు ను కోరారు. పట్టణంలో విద్యా ప్రభుత్వ సంస్థలలో విస్తృత ప్రచారం నిర్వహించారు.. గోపి మూర్తి మాట్లాడుతూ.. తమ పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయుల, అధ్యాపకుల ఉద్యోగుల, కార్మికుల నిరుద్యోగుల,పేదల సమస్యల పరిష్కారం కోసం వారి హక్కుల కోసం హక్కుల రక్షణ కోసం సంక్షేమం,ప్రయోజనాల కోసం పోరాడుతున్నా మన్నారు. గత 17 సంవత్సరాలుగా పిడిఎఫ్ కు సంబంధించిన 16 మంది ఎమ్మెల్సీలు శాసనమండలిలో నిరుద్యోగుల కోసం ప్రభుత్వాలను నిలదీశామన్నారు.. నేడు దిడ్ల రాఘవులకు విజయంతో మన స్థానాన్ని తిరిగి మనం కైవసం చేసుకోవాలన్నారు.. నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీ తమ అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టి రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజాస్వామ్యంను అపహాస్యం చేస్తుందన్నారు.. ఇప్పటికే ప్రజలు రాష్ట్రంలో గత 8 నెలలు క్రితం జరిగిన ఎన్నికల్లో అధికార కూటమిని 165 స్థానాల్లో గెలిపించి అఖండ విజయం అందించి అధికారంలోకి తీసుకు వచ్చారన్నారు.. అయితే ఈ ఎన్నికల్లో ఆపార్టీకి ఓటు వేసి వేసిన ప్రయోజనం లేదన్నారు. ప్రజల్లో అసంతృప్తి వచ్చిందన్నారు.(ఫై చిత్రం స్థానిక చీదే సత్యనారాయణ కాలజీలో )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *