సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం కెసిఆర్ కుమార్తె.. 164 రోజులు జైలు జీవితం గడిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠ ముగిసింది. ఎట్టకేలకు . కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. తిహాడ్ జైలులో ఉన్న కవిత బెయిల్ పై నేడు, మంగళవారం సుప్రీం కోర్ట్ లో సుదీర్ఘ విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడటంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందోనన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ఎట్టకేలకు బెయిల్ రావడంతో మాజీ మంత్రి కేటీఆర్ తో సహా పార్టీలో హర్షము వ్యక్తం అవుతుంది.
