సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం ఢిల్లీలో లిక్కర్ స్కాం ఫై తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ను ఈడీ అధికారులు విచారణ ప్రారంభించి నేటి సాయంత్రానికి 6 గంటల పాటు విచారణ కొనసాగిస్తూనే ఉండటం విశేషామ్.. రాత్రి 8 గంటల వరకు విచారణ జరుగుతుందని రేపు ఆదివారం కూడా విచారణ ఉంటుందని లేదంటే.. తదుపరి అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కాగా.. కవిత వాడిన 10 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారన్నది ఆమెపై మొదట్నుంచీ వస్తున్న ఆరోపణ. అసలు కవిత వాడిన ఫోన్లు ఎన్ని..? ఎందుకు ధ్వంసం చేశారనేదానిపై ప్రధానంగా ఈడీ ఇప్పుడు విచారించినట్లు తెలుస్తోంది. అయితే ఫోన్లపై ఈడీ ప్రశ్నలకు కవిత ఏమని సమాధానం చెప్పారనేది తెలియరాలేదు. ఇలా ఫోన్ల ధ్వంసం గురించి విచారణ అయ్యాకే అధికారులు కవిత వాడుతున్న తాజా ఫోన్‌ను అడుగగా ఆమె తేలేదు అనడంతో ఆమె ఇంటి నుంచి తిరిగి తెప్పించారని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో కాల్ డేటాను, వాట్సాస్ చాటింగ్‌ను అధికారులు నిశితంగా పరిశీలిస్తారని తెలియవచ్చింది. కవిత సోదరుడు మంత్రి కేటీఆర్ ఢిల్లీలోనే ఉండి పరిస్థితి సమీక్షిస్తున్నారు..
