సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ శాసనమండలి లో ఇప్పటికి వైసీపీ చాల బలంగా ఉంది. అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్ఆదేశాల ప్రకారం ఎవరు ఊహించని విధంగా ఉత్తరాంధ్ర రాజకీయాలలో వైసీపీలో దూకుడు నేతగా పేరున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను ఆ పార్టీ నుంచి సస్పెం డ్ చేశారు. గత కొంత కాలంగా ఆయన మరో మహిళతో సహజీవనం గడుపుతూ అతని భార్య, కూతురు వివాదానికి దిగటంతో తెలుగు రాష్ట్రాలలో మీడియాలో తరచూ ‘రచ్చ రచ్చ’ వార్తలలోకి ఎక్కారు. దీనితో టెక్కలి వైసీపీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి దువ్వాడను తప్పించి పేడాడ తిలక్‌కు ఇవ్వడం గతంలోనే జరిగింది. అయిన దువ్వాడ తీరు మారలేదు. గత కొంత కాలంగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్న దువ్వాడ శ్రీను.. సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌ను. అచ్చేమ్ నాయుడు ను అసభ్య పద జాలంతో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. స్వంత పార్టీ నేతలనుండి పార్టీకి నష్టం అన్ని పిర్యాదులు రావడంతోవైసీపీ పార్టీ క్రమశిక్షణ కమిటీ సూచనలతో దువ్వాడను సస్పెండ్ చేసారు.. దువ్వాడ శ్రీనివాస్ 2019లో శ్రీకాకుళం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి హోరాహోరీ పోరులో ఓటమి చెందారు. మళ్లీ 2024లో టెక్కలి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కింజరాపు అచ్చెన్నాయుడు చేతిలో ఘోర పరాజయం పొందారు. అయితే ఎమ్మెల్సీ గా కొనసాగుతున్నారు.
