సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తరాంధ్ర కు చెందిన వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పదవి కి అనర్హుడయ్యారు. రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు ఆయనపై అనర్హత వేటు వేశారు. రఘురాజు టీడీపీ పార్టీకి ఫిరాయించినట్లు నిర్ధారించారు, కొద్దీ కాలం క్రితం ఆయన భార్య ను ముందుగా టీడీపీ లో చేర్పించి తాను మాత్రం వైసీపీలో పదవి అనుభవిస్తూ టీడీపీ వారి పక్షము నిలచినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు నేడు, సోమవారం శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఉత్తర్వు లు జారీ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజు టీడీపీ నేతలతో కుమ్మకై ఎస్.కోటలో స్థానిక వైఎస్సార్సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును, విశాఖ లోక్ సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఓడించేం దుకు పన్నిన కుతంత్రాలు నిర్ధారిస్తూ రఘురాజుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో వైఎస్సా ర్సీపీ విప్ పాలవలస విక్రాంత్ ఇప్పటికే ఫిర్యా దు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 27న రావాలని మండలి చైర్మన్ మోషేన్ రాజు తాఖీదులు పంపిన రఘురాజు హాజరు కాలేదు. ఈనెల 31న ఆఖరిసారిగా మరో అవకాశం ఇవ్వగా విచారణ కు రాకుండా ఆసుపత్రి లో చేరినట్లు నిర్ధారించుకున్న మోషేను రాజు ఆయన ను ఎన్నికల ఓటింగ్ కు ఒక రోజు ముందే ఎమ్మెల్సీ పదవి ఫై వేటు వేసి రఘురాజు ను మాజీ ఎమ్మెల్సీ గా మార్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *