సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల భీమవరం సమీపములోని చెరుకువాడ గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అంత్యక్రియలు నేడు, ఆదివారం మధ్యాహ్నం ఏలూరు లో కుటుంబ సభ్యులు, యూటీఎఫ్‌ నాయకులు సమక్షంలో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అమెరికాలో నివాసం ఉంటున్న ఆయన కుమార్తె గత శనివారం రాత్రికి ఏలూరు చేరుకొన్నారు, తొలుత ఆశ్రం ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచిన భౌతికకాయాన్ని తీసుకుని ర్యాలీగా యూటీఎఫ్‌ జిల్లా కార్యాల యానికి తీసుకొనివెళ్ళారు. తదుపరి నేటి ఉదయం 10-30 నుంచి ఏలూరు నగరంలోని ఇండోర్‌ స్టేడియంలో సాబ్జీ భౌతిక కాయాన్నీ ఉంచగా విశేషంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రజాప్రతినిధులు ప్రజల సందర్శించుకొన్నారు. తదుపరి మధ్యాహ్నం మదీనా మసీదు వద్ద వున్న శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. నేటి సాయంత్రం యూటీఎఫ్‌ భవన్‌లో సంతాప సభ నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *