సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేటి గురువారం మధ్యాహ్నం లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించారు. ఈ జాబితాలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగిస్, ఒకరు కెనడియన్, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మరణించారు. ఇప్పటికే పూర్తిగా దగ్ధం అయినా విమాన శకలాల నుండి 50 మృతదేహాలును వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరే అన్ని విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటించారు. అయితే ఈ విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా తీవ్ర గాయాలతో మరణించారు. ఆయన కుమార్తె లండన్‌లో నివసిస్తుంది. ఈ నేపథ్యలంలో ఆమె వద్దకు వెళ్లేందుకు ఆయన లండన్ ప్రయాణమయ్యారు.కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఈ ప్రమాదం వెనుక అసలు కారణాలను దర్యాప్తు చేస్తామన్నారు.
