సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో చైనా ను ఎదుర్కోవడానికి భారత్ సహకారం అందిస్తుందని అమెరికా పెద్దల ఆలోచన.. అయితే భారత్ తో స్నేహం తెగేవరకు లాగేస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజా పరిణామాలలో రష్యా తో పాటు ఇటీవల చైనా తో కలసి స్నేహం చిగురించి భారత్ కొత్త ఒప్పందాలు చేసుకోవడంతో ఇక చైనా ను కంట్రోల్ చెయ్యాలంటే అమెరికా రక్షణ బలగాలకు.. ఇకపై, భారత్ మద్దతు ఇవ్వదు కాబ్బటి.. ఆసియాలో మరో ఎయిర్ బేస్ కావాల్సి ఉందని అమెరికా రక్షణ వ్యవస్థ తేల్చడంతో.. తాజగా ట్రంప్ కన్ను తాము గతంలో అనధికారంగా పాలించి, బిడెన్ హయాంలో అర్ధాంతరంగా ఆ దేశాన్ని తాలిబన్ లకు వదిలేసి వచ్చేసిన ఆప్ఘనిస్తాన్ ఫై పడింది. ట్రంప్ తాజా ప్రకటనలో ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను తమకు తిరిగి ఇవ్వాలని గట్టిగ డిమాండ్ చేసాడు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. చైనాను పర్యవేక్షించేందుకు ఆ బేస్ ఎంతో కీలకమని ట్రంప్ అభిప్రాయపడ్డారు.. అయితే, తాలిబన్లు మాత్రం అమెరికా సైనికులు తిరిగి ఆఫ్గనిస్తాన్ రావడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారుతోంది.
