సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: ప్రముఖ మేధావి, ప్రపంచ బిలియనీర్ ఎలోన్ మస్క్ ఎన్నికలకు వాడుతున్న ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలుచేశారు. ఈవీఎంల భద్రతను ప్రశ్నిస్తూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మానవులు, లేదా ఏఐ ద్వారా ఈవీఎంలను హ్యా క్ చేసే ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికి వాటి పర్యవసానాలు భారీ స్థాయిలో ఉంటాయని ట్వీట్లో పేర్కొ న్నారు. మస్క్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరోక్షంగా స్పందించారు. దేశంలోని ఈవీఎంలను‘బ్లాక్ బాక్స్’అని అభివర్ణించారు. దేశంలో 140 పైగా ఎంపీ స్థానాలలో అసలు పోలయిన ఓట్ల కన్నా లెక్కింపు లో ఎక్కువ ఓట్లు వచ్చాయని వస్తున్నా వార్త కథనాలను, ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభ స్థానం ఫలితాలపై దుమారం రేపిన వార్తా కథనాల్నిఉదహరిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘భారత్లో ఈవీఎంలు ఒక బ్లాక్ బాక్స్. వాటిని పరిశీలించడానికిఎవరికీ అనుమతి లేదు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించినప్పుడు గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయి’అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభ శివసేన ఎంపీ రవీంద్ర 48 ఓట్ల తేడాతో గెలుపొందారు. అక్కడ ఇవిఎం ను మంగేష్ ఫన్హాల్కర్ అనే వ్యక్తి ఫోన్ ద్వారా టాంపరింగ్ చేసారని ఆరోపణలతో పోలీస్ విచారణ జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *